యాక్షన్ చిత్రాల దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న వివి వినాయక్ గత కొంత కాలంగా దర్శకుడిగా సక్సెస్లు దక్కించుకోలేక పోతున్నాడు. గత కొంత కాలంగా ఈయన ఏ హీరో వద్దకు వెళ్లినా కూడా ప్రస్తుతానికి డేట్లు ఖాలీ లేవు అంటున్నారట. ఇప్పుడు ఇతర హీరోల వద్దకు వెళ్లకుండా తానే హీరో అయ్యేందుకు సిద్దం అవుతున్నాడు. దిల్రాజు బ్యానర్లో వినాయక్ హీరోగా ఒక చిత్రం తెరకెక్కబోతుంది. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎప్పుడో ప్రారంభం అయ్యింది. చాలా రోజులుగా సినిమా గురించి అంటున్నారు, ప్రారంభం ఎప్పుడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు వినాయక్ హీరోగా నటించబోతున్న సినిమా ప్రారంభంపై క్లారిటీ వచ్చింది. అక్టోబర్ 9వ తారీకున సినిమాకు ముహూర్తంను ఫిక్స్ చేశారు. అప్పటి వరకు వినాయక్ చాలా బరువు తగ్గాల్సి ఉంది. వినాయక్ ఈ చిత్రం కోసం దాదాపుగా పాతిక కేజీల బరువు తగ్గేందుకు కఠినంగా కసరత్తులు చేస్తున్నాడు. మరి ఈ చిత్రంతో వినాయక్ నటుడిగా సెటిల్ అవుతాడేమో చూడాలి. నర్సింహారావు అనే దర్శకుడు ఈ చిత్రంను దిల్రాజు బ్యానర్లో తెరకెక్కిస్తున్నాడు.