యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ త్వరలో హీరోగా ఓ చిత్రంలో నటించనున్నాడు. గతకొంత కాలంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వినాయక్ కూడా హీరోగా కనిపించడానికి బరువు తగ్గడానికి అనేక కసరత్తులు చేస్తున్నాడు. ఈ చిత్రంలో వినాయక్ 1940 నాటి రైతుగా కనిపించనున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రానికి హాజరయిన ప్రముఖులలో వినాయక్ ఒకరు. అయితే ఈ సారి చాలామంది కళ్లు కూడా వినాయక్‌పైనే పడ్డాయి. కెమెరాలు కూడా వినాయక్నే ప్రత్యేక దృష్టితో చూసినట్టు తెలుస్తోంది.
వినాయక్ హెయిర్ స్టయిల్‌ను పూర్తిగా మార్చేసి, గ్లాసెస్ పెట్టుకుని చాలా సాఫ్ట్‌గా, డిఫరెంట్‌గా కనిపించాడు. ఈ లుక్‌లో వినాయక్‌ని చూసిన వారందరు కూడా హీరో లుక్ వచ్చేసిందంటూ పొగుడుతున్నారు. డిఫరెంట్ స్టయిల్‌తో న్యూలుక్లో ఉన్న వినాయక్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.