Vishwambhara : ‘విశ్వంభర’ సెట్స్ లోకి వివి వినాయక్ ఎంట్రీ..

Jani Master : అవే నిజమైతే ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోతా : జానీ మాస్టర్

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయం పైకప్పు లీక్.. గర్భగుడిలోకి నీరు !

ప్రస్తుతం ‘విశ్వంభర’ షూటింగ్ అన్నపూర్ణ సెవెన్ ఎక‌ర్స్‌ లో వేసిన మ్యాసీవ్ సెట్ లో జరుగుతుండగా, అక్కడికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ వచ్చారు. ఇక గ‌తంలో మెగాస్టార్ చిరంజీవితో ‘ఠాగూర్’, ‘ఖైదీ నెంబ‌ర్ 150’ వంటి బ్లాక్ బ‌స్టర్ చిత్రాల‌ను అందించిన వివి.వినాయ‌క్.. ఈ సందర్భంగా చిరంజీవిగారితో ఆయనకున్న ప్రత్యేక అనుబంధాన్ని పంచుకుంటూ కాసేపు మాట్లాడుకున్నారు. చిత్ర యూనిట్ కి, డైరెక్టర్ వశిష్ట కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Sonakshi Sinha : ప్రియుడిని పెళ్లాడిన బాలీవుడ్ బ్యూటీ..

ఇకపోతే సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.

Nagarjuna : క్షమాపణలు చెప్పిన నాగార్జున..?