‘ఓటర్’ ట్రైలర్ టాక్…

మంచు విష్ణు – సురభి కాంబినేషన్లో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన చిత్రం ఓటర్. జి.ఎస్.కార్తీక్ దర్శకత్వం వహించగా..ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జూన్ 21న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ట్రైలర్ విషయానికి వస్తే.. ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు ఇష్టమొచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల తరవాత వాళ్లను పట్టించుకోని రాజకీయ నాయకుల పనిపట్టే ఓటర్‌గా ఈ సినిమాలో మంచు విష్ణు కనిపించబోతున్నారు. ప్రజలను మోసం చేసిన రాజకీయ నాయకులను తన తెలివితేటలతో హీరో ఎలాంటి గుణపాఠం నేర్పాడో చూపించబోతున్నారు. మంచు విష్ణు చాలా కాలం తరవాత మరో పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. మరి గత కొంతకాలంగా సరైన హిట్ లేని విష్ణు కు ఈ సినిమా ఎలా కలిసొస్తుందో చూడాలి. ఆ లోపు మీరు ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.