చిత్ర..మొదటి & చివరి చిత్రం రాబోతుంది

తమిళ నటి వీజే చిత్ర రీసెంట్ గా అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా ఈమె నటించిన తొలి , చివరి చిత్రం రిలీజ్ కు సిద్ధమైంది. ఇన్‌ఫైనైట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌.జయకుమార్‌, జే. కావేరి సెల్వి నిర్మాణంలో కాల్స్ అనే సినిమా చేసింది. 2019 జూలైలో ‘కాల్స్‌’ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. జె.శబరీష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ చెన్నై, తంజావూరు, తిరుచ్చి, వారణాసి తదితర ప్రాంతాల్లో జరిగింది.

ఢిల్లీ గణేష్‌, నిళల్‌గళ్‌ రవి, ఆర్‌.సుందరరాజన్‌, దేవదర్శిని, వినోదిని, వైద్యనాధన్‌, జీవా రవి, శ్రీరంజని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ జనవరిలోనే పూర్తి కావడంతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై నెలలో విడుదల చేయాలనుకున్నారు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. జనవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో చిత్ర మరణించడం..చిత్ర యూనిట్ ను షాక్ కు గురి చేసింది. కొత్త ఏడాది కానుకగా చిత్ర ట్రైలర్ విడుదల చేసి, సినిమాను జనవరి లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.