ఈ వారానికి కెప్టెన్సీ పోటీదారులుగా వితిక, శ్రీముఖి, మహేష్‌లు నిలిచారు. వీరితో పాటు మరో ముగ్గురు వీరికి సహాయంగా టాస్క్‌లో పాల్గోన్నారు. కాగా వితిక ఈ వారం కెప్టెన్‌గా ఎంపికయింది. అందుకు వరుణ్ టాస్క్‌లో సాయం చేశాడు. దాంతో బిగ్‌బాస్ ఇంటికి మరో లేడి కెప్టెన్ వచ్చేసింది. బిగ్‌బాస్ సీజన్ 3 తొలి లేడి కెప్టెన్‌గా శివజ్యోతి బాధ్యతలు చేపట్టింది. ఆమె తర్వాత రెండో మహిళా కెప్టెన్‌గా వితిక నిలిచింది. కెప్టెన్ అయినందుకు వితిక సంతోషం మామూలుగా లేదు. బిగ్‌బాస్ ఇంటికి కెప్టెన్ అయ్యానోచ్ అంటూ స్నేహితురాలు పునర్నవితో కలిసి గంతులేసింది. అయితే కెప్టెన్ అవడంతో వితిక ప్రవర్తనలో ఏమన్నా మార్పు కనబడుతుందా? అనేది చూడాలి.