బిగ్‌బాస్‌ ఇంటికి మరో లేడి కెప్టెన్‌

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 గత సీజన్‌లతో పోల్చితే రేటింగ్‌ విషయంలో కాస్త వెనుకబడి ఉన్న విషయం తెల్సిందే. ఈ సారి మంచి కంటెస్టెంట్‌లు ఉన్నా కూడా వారికి తగిన టాస్క్‌లు ఇవ్వకపోవడం వల్ల ఈ షోపై ఆసక్తి సన్నగిల్లుతుంది. కంటెస్టెంట్ల విషయంలో వరుణ్‌, వితికల జంట కాస్త ఆసక్తికరమైనదే. భార్యాభర్తలు ఈ ఇంట్లో ఎలా ఉంటారు అని పేక్షకులు వీరిపట్ల ఆసక్తిని కనబర్చుతున్నారు. ఇక తాజాగా బిగ్‌ బాస్‌ ఇంట్లో ఎనమిదోవారం కెప్టెన్సీ టాస్క్‌ జరిగింది.

ఈ వారానికి కెప్టెన్సీ పోటీదారులుగా వితిక, శ్రీముఖి, మహేష్‌లు నిలిచారు. వీరితో పాటు మరో ముగ్గురు వీరికి సహాయంగా టాస్క్‌లో పాల్గోన్నారు. కాగా వితిక ఈ వారం కెప్టెన్‌గా ఎంపికయింది. అందుకు వరుణ్‌ టాస్క్‌లో సాయం చేశాడు. దాంతో బిగ్‌బాస్‌ ఇంటికి మరో లేడి కెప్టెన్‌ వచ్చేసింది. బిగ్‌బాస్‌ సీజన్‌ 3 తొలి లేడి కెప్టెన్‌గా శివజ్యోతి బాధ్యతలు చేపట్టింది. ఆమె తర్వాత రెండో మహిళా కెప్టెన్‌గా వితిక నిలిచింది. కెప్టెన్‌ అయినందుకు వితిక సంతోషం మామూలుగా లేదు. బిగ్‌బాస్‌ ఇంటికి కెప్టెన్‌ అయ్యానోచ్‌ అంటూ స్నేహితురాలు పునర్నవితో కలిసి గంతులేసింది. అయితే కెప్టెన్‌ అవడంతో వితిక ప్రవర్తనలో ఏమన్నా మార్పు కనబడుతుందా? అనేది చూడాలి.