తమిళనాడు రాష్ట్రంలో “విశ్వరూపం” బ్యాన్

Viswaroopam-reviewకమల్ హసన్ సినిమా విశ్వరూపం విడుదలను తమిళనాడు రాష్ట్రంలో బ్యాన్ చేసినట్టు సమాచారం. మొత్తానికి ఈ సినిమా కమల్ కు విడుదలకు ముందే విశ్వరూపం చూపిస్తుంది. ఇప్పటికే పలు వివాదాలతో సతమత మవుతున్న కమల్ హసన్ కు ఇది మరో దెబ్బేనని చెప్పుకోవాలి. ఈ నెల 25న విడుదలకు సిద్ధం అయిన ఈ చిత్రం విడుదలయితే రాష్ట్రంలో మతకల్లోలాలు చెలరేగే అవకాశాలున్నాయంటూ కొన్ని ముస్లిం సంస్థలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. అందుకే ప్రభుత్వం నుండి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ విడుదలను ఆపివేయాలని నిర్ణయించడం జరిగింది. ఇంతకు ముందే పలు ముస్లిం సంఘాలు విశ్వరూపం చిత్రంలో ముస్లింలను కించపరిచే సన్నివేశాలు ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేయడం, అలాగే తమిలనాడు ముస్లిం మున్నేట్ర కజగం ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఎం.హెచ్. జవహిరుల్లా అక్కడి సెన్సార్ బోర్డు సభ్యులను కలిసి సినిమాను బ్యాన్ చేయవలసిందిగా వినతిపత్రం అందజేయడం తెలిసిన విషయాలే! ఇదిలా ఉంటే థియేటర్ యాజమాన్యాల తీరుపై గుర్రుగా ఉన్న కమల్ ఇదంతా సినిమాను అడ్డుకోవడానికి వారు పన్నుతున్న కుట్రగా పరోక్షంగా తెలియజేసారు.