మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’ ఇప్పటికే భారీ అంచనాలు సెట్ చేస్తోంది. టీజర్‌తో ఈ చిత్రం మెస్మరైజ్ చేసే విజువల్ వరల్డ్‌ను పరిచయం చేస్తూ, ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు UV క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. ప్రాజెక్ట్‌కు హైప్ పెంచుతూ, అకాడమీ అవార్డు విజేత ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ ‘రామ రామ’ ఏప్రిల్ 12న విడుదల కానుంది. ఈ పాట డివోషనల్ ఫీలింగ్‌తో నిండినట్టు పోస్టర్ సూచిస్తోంది. చిరంజీవి చుట్టూ హనుమంతుడి వేషధారణలో ఉన్న పిల్లలు, బ్యాక్‌డ్రాప్‌లో రాముడి శిల్పం – ఇవన్నీ పాటకి అద్భుతమైన డివైన్ టచ్ ఇస్తున్నాయి. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, సినిమా మ్యూజిక్‌కు ఇది శుభారంభం కానుంది.