Site icon TeluguMirchi.com

ఫలక్‌నుమా దాస్‌ ‘పాగల్‌’ అవుతున్నాడట

విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఫలక్‌నుమా దాస్‌’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కమర్షియల్‌గా వసూళ్ల విషయం పక్కన పెడితే ఈ చిత్రంతో హీరోగా విశ్వక్‌సేన్‌ మంచి గుర్తింపును అయితే దక్కించుకున్నాడు. ఆ సమయంలోనే విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌తో గొడవ కారణంగా కూడా ఈయనకు మంచి ఫాలోయింగ్‌ అయితే ఏర్పడింది. మొదటి సినిమాతోనే రచ్చ రచ్చ చేసిన విశ్వక్‌సేన్‌ ప్రస్తుతం తన తదుపరి చిత్రం చర్చల్లో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

విశ్వక్‌సేన్‌ హీరోగా ‘పాగల్‌’ అనే చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రంను పలు ప్రేమ కథా చిత్రాలను నిర్మించి పలు సక్సెస్‌లను దక్కించుకున్న నిర్మాత వేణుగోపాల్‌ బెక్కం నిర్మించబోతున్నాడు. పాగల్‌ ఒక విభిన్నమైన మాస్‌ ప్రేమ కథ అంటూ నిర్మాత చెబుతున్నాడు. దర్శకుడిగా నరేష్‌ రెడ్డి పరిచయం కాబోతున్నాడు. ఈ కొత్త దర్శకుడు చెప్పిన కథకు నిర్మాత బాగా కనెక్ట్‌ అయ్యాడట. ఈ కథకు విశ్వక్‌సేన్‌ తప్పకుండా న్యాయం చేస్తాడనే ఉద్దేశ్యంతో ఆయన్ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నట్లుగా నిర్మాత అన్నాడు. సెప్టెంబర్‌ రెండవ వారంలో షూటింగ్‌ మొదలు పెట్టి వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేయబోతున్నారట.

Exit mobile version