Site icon
TeluguMirchi.com

Laila : ఆకట్టుకుంటున్న విశ్వక్ సేన్ స్టైలిష్ లుక్


Laila First Look : మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన అప్ కమింగ్ మూవీ ‘లైలా’ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ యూనిక్ క్యారెక్టర్ లో అబ్బాయి, అమ్మాయిగా రెండింటినీ పోషించి తన వెర్సటాలిటీ చూపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ని షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. లైలా ఐ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది.

క్రిస్మస్ సందర్భంగా, మేకర్స్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో విశ్వక్సేన్ అద్భుతమైన స్టైలిష్, రిచ్ అవతార్‌లో కనిపించారు. మోడరన్ అవుట్ ఫిట్ లో స్పోర్టింగ్ షేడ్స్, గోల్డ్ యాక్ససరీస్ ధరించి కూల్ అండ్ కాన్ఫిడెంట్ గా కనిపించారు. అతని పాత్రను, సోను మోడల్‌గా ప్రజెంట్ చేస్తూ, అతను మెడపై పచ్చబొట్టు, చేతులపై “సోను లవర్”, సోను కిల్లర్” అని రాసి ఉన్న టాటూలతో కనిపించాడు.

ఇకపోతే విశ్వక్సేన్ ఈ చిత్రంలో అమ్మాయి పాత్రను పోషించడానికి బ్యూటీఫుల్ గా మేక్ఓవర్ అయ్యారు. ఇందులో చాలా వేరియేషన్స్ చూపించబోతున్నారు. ఈ చిత్రంతో ఆకాంక్ష శర్మ కథానాయికగా అరంగేట్రం చేస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Exit mobile version