Vishwak Sen : దీపావళికి వస్తున్న ‘మెకానిక్ రాకీ’ !


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తన అప్ కమింగ్ మూవీలో ‘మెకానిక్ రాకీ’ గా అలరించబోతున్నారు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. హై బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read : ‘ఉరుకు పటేల’ ఫస్ట్ లుక్

మెకానిక్ రాకీ చిత్రాన్ని అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో విశ్వక్ సేన్ గన్, రెంచ్‌ను పట్టుకుని బాడ్ యాస్ అవతార్‌లో కనిపించారు. కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్ ఇతర నటీనటులు.