Vishwak Sen : కొత్త సినిమా అనౌన్స్ చేసిన విశ్వక్ సేన్..


Vishwak Sen New Movie : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో ‘మెకానిక్ రాఖీ’ లో నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం దీపావళికి రిలీజ్ కానుంది. మరోవైపు ‘లైలా’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా నేడు మరో సినిమాను అనౌన్స్ చేసారు విశ్వక్ సేన్.

Also Read : పుష్ప 2 క్లైమాక్స్ గూస్ బంప్స్ అంతే..!

SLV సినిమాస్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం 8 గా, #VS13 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్ చూస్తుంటే విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ పోస్టర్ పై ప్రతి యాక్షన్ కి అదిరిపోయే రియాక్షన్ ఉంటుంది అని ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇక హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రానికి శ్రీధర్ గంట దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ‌ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించనున్నారు.