Site icon TeluguMirchi.com

పాపం విష్ణు ఎంత బాధపడుతున్నాడో..

మంచు విష్ణు తీవ్ర దుఃఖం లో ఉన్నాడు..దీనికి కారణం కరోనా వైరస్. ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ఆంతర్జాతీయ విమానాల రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో మంచు విష్ణు భార్య పిల్లలు విదేశాల్లో..విష్ణు ఒక్కడు ఇక్కడ ఉండిపోయాడట. పిల్లలు వదిలి ఇన్ని రోజులు అస్సలు ఉండలేదని చెప్పుకొని బాధపడుతున్నాడు.

ఈ విషయాన్ని విష్ణు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. `వెరోనికాను, పిల్లలను చాలా మిస్సవుతున్నా. చాలా బాధగా ఉంది. నేను ఎందుకు గడ్డం పెంచుతున్నానని చాలా మంది అడుగుతున్నారు. దానికి ఓ కారణముంది. నా భార్య, పిల్లలు వేరే ఊరిలో ఉన్నారు. వాళ్లు ఇక్కడికి వచ్చిన తర్వాత గడ్డం తీస్తాను. ఏప్రిల్‌ 14న ఇంటర్నేషనల్‌ ఫ్లైట్స్‌ అనుమతిస్తారని అనుకుంటున్నాను. గత ఏడేళ్లుగా నేను ఎక్కడికి వెళ్లినా సాయంత్రానికి తిరిగి వచ్చేసేవాడిని. పిల్లలతో నాకు అటాచ్‌మెంట్‌ చాలా ఎక్కువ. అందుకే ఇప్పుడు బాగా కష్టంగా ఉంది. మేము అంతా ఒకే దగ్గర క్వారంటైన్‌లో ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేద`ని విష్ణు చెప్పుకొని బాధ పడ్డాడు.

Exit mobile version