రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో మొదలెట్టారు !

varma vishnuదర్శకుడు రాంగోపాల్ వ‌ర్మ –హీరో మంచు విష్ణు క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబదించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు ఫిల్మ్ నగర్ టెంపుల్ జరిగాయి. ఈ చిత్రం కధ విషయానికి వస్తే…రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుందని టాక్. విష్ణు మొదటి సారిగా వేరే బ్యానర్ నటిస్తున్న చిత్రమిది. వర్మ దర్శకత్వం, రాయలసీమ బ్యాక్ డ్రాప్ ఆసక్తి కలిగించే అంశాలు. దేనికైనా రెడీ, దూసుకెళ్తా వంటి హిట్స్ తరువాత విష్ణు చేస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి, విష్ణు సరసన రేజీనా హీరోయిన్ నటిస్తుందని వినిపిస్తోంది. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.