Kannappa : డిసెంబర్‌లోనే ‘కన్నప్ప’.. కన్ఫర్మ్ !


డైనమిక్ హీరో విష్ణు మంచు ‘కన్నప్ప’ ప్రాజెక్ట్ మీద దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవలె విడుదల చేసిన టీజర్‌తో కన్నప్ప క్రేజ్ మరింతగా పెరిగింది. కన్నప్ప చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేస్తామని ఇది వరకే ప్రకటించారు. తాజాగా మరోసారి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసారు విష్ణు మంచు. కన్నప్ప ఈ ఏడాది డిసెంబర్‌లోనే వస్తుందని విష్ణు ట్వీట్ చేసారు.

Also Read : దీపావళికి వస్తున్న ‘మెకానిక్ రాకీ’ !

అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఈ చిత్రాన్ని పద్మశ్రీ డా.మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సీ సంగీతాన్ని అందిస్తున్నారు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారగణంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

Also Read : ‘ఉరుకు పటేల’ ఫస్ట్ లుక్