Site icon TeluguMirchi.com

Mark Antony : తెలుగులో తొలిసారి పాట పాడిన విశాల్.. ప్రోమో అదుర్స్ !


వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో విశాల్.. పలు యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మాస్ ఆడియన్స్ మెప్పు పొందుతున్నారు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు ‘మార్క్ ఆంటోనీ’ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌ గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో విశాల్ కి జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్ వినోద్ కుమార్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

రవితేజ ‘వెంకీ’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్..

ప్రస్తుతం చివరి దశ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ తెలిపారు. ఇందులో భాగంగా చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన టీం.. తాజాగా ఈ సినిమా నుంచి విశాల్ ఆలపించిన అదరద సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ‘అదరద గుండె అదరద మావా.. బెదరగ బెంగ మొదలవదా..’ అంటూ సాగిపోతున్న ఈ పాటను విశాల్ ఫుల్ ఎనర్జీతో పాడారు. దీంతో ఈ సాంగ్ ప్రోమో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ ‘మార్క్ ఆంటోని’ మూవీలో విశాల్ పాడిన ఈ సాంగ్ హైలైట్ కానుందట.

Adharadha Promo | Mark Antony (Telugu) | First Single | Vishal | S.J.Suryah | GV Prakash | Adhik

ఇకపోతే ఇటీవల రిలీజైన ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. విశాల్ ఇందులో సరికొత్తగా కనిపించారు. గుబురు గడ్డంతో ఫైర్ చేస్తున్న విశాల్ లుక్ మరియు ఎస్.జె.సూర్య కామెడి టైమింగ్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రానికి సంగీతం జి.వి. ప్రకాష్ అందిస్తున్నారు.

Baby : అందరూ కలిసి ఏడిపించారు.. విజయ్ దేవరకొండ

Exit mobile version