Shine Tom Chacko: దసరా విలన్ పై ఫిల్మ్ ఛాంబర్ లో పిర్యాదు చేసిన మలయాళ నటి


మలయాళ నటి విన్సీ అలోషియస్ తన సహనటుడు షైన్ టామ్ చాకోపై కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఆమె ఒక వీడియో విడుదల చేస్తూ ఓ నటుడు షూటింగ్ సమయంలో డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యంగా ప్రవర్తించాడని వెల్లడించారు. అయితే ఆ వీడియోలో నటుడి పేరు లేదా సినిమా వివరాలు మాత్రం చెప్పకుండా మళ్లిపోయారు. ఇప్పుడు మాత్రం ఆమె షైన్ టామ్ చాకో అనే నటుడి పేరు బయట పెట్టారు. ‘సుత్రవాక్యం’ అనే సినిమా సెట్లో ఆయన మద్యం మత్తులో ఉండగా తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు.

Also Read :  HIT 3 : ఏపీలో 'హిట్ 3' టిక్కెట్ల ధరల పెంపు

ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో మాట్లాడుతూ “ఓ సినిమా షూటింగ్ సమయంలో ఆ హీరో డ్రగ్స్ తీసుకున్నాడు. నాతో అనుచితంగా ప్రవర్తించాడు. ఆ రోజులు ఎంతో ఇబ్బందిగా గడిచాయి. తన ముందే దుస్తులు మార్చుకోవాలంటూ ఇబ్బంది పెట్టేవాడు. అందరి ముందే అసభ్యంగా మాట్లాడేవాడు. ఇది నా జీవితంలో అత్యంత అసహ్యకరమైన సంఘటన” అని విన్సీ తెలిపారు.

కొన్ని రోజుల క్రితం కేరళలోని పల్లిపురం చర్చిలో జరిగిన KCYM మీటింగ్‌లో పాల్గొన్న ఆమె, “డ్రగ్స్ తీసుకునే ఆర్టిస్ట్‌తో ఇకపై పని చేయను” అని ప్రకటించారు. ‘రేఖ’, ‘వికృతి’, ‘జన గణ మన’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విన్సీ అలోషియస్, ఇప్పుడు తన అనుభవాలను బహిర్గతం చేయడంతో సినిమా పరిశ్రమలో పలువురు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. గతంలోనూ పలువురు నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. విన్సీ విషయాన్ని కూడా పరిశ్రమ సీరియస్‌గా తీసుకుని, సంబంధిత వ్యక్తిపై న్యాయసమ్మతంగా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read :  CM Pellam : ప్రజాసేవపై ప్రశ్నలు వేసే సినిమా – మే 9న థియేటర్లలో