Site icon TeluguMirchi.com

విమానంలో నాయక్ విజయ యాత్ర

Vinayaks-chartered-flightప్రత్యేక విమాన యాత్ర : రామ్ చరణ్ తన అభిమానులను కలుసుకొనేందుకు ప్రత్యేక విమానంలో పర్యటన చేయబోతున్నారు. ఆదివారం ఉదయం చరణ్ విశాఖపట్నం నుంచి ఈ యాత్రకి శ్రీకారం చుడతారు. ‘నాయక్’ చిత్ర నిర్మాత డి.వి.వి. దానయ్య విలేకర్లతో మాట్లాడుతూ.. “ ఈ సినిమా విజయవంతమైన నేపథ్యంలో చరణ్ నేరుగా అభిమానులను కలుసుకొనేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకొంటారు. ఆ తరవాత రాజమండ్రి, విజయవాడ, తిరుపతి నగరాల్లో పర్యటన ఉంటుంది. దర్శకుడు వి.వి. వినాయక్ కూడా పాల్గొంటారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘నాయక్’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో గండి బాబ్జీ అనే పేరును వాడినందుకు అభ్యంతరం వ్యక్తమైంది. అన్ని థియేటర్లకు ఆ పేరుని తొలగించమని చెప్పాం. దాదాపు గా ఇప్పటికే అందరూ తొలగించారు” అన్నారు.

Exit mobile version