Site icon TeluguMirchi.com

తిరుపతిలో ఘనంగా జరిగిన “వినరో భాగ్యము విష్ణు కథ” ఆడియో ఆవిష్కరణ


మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా “వినరో భాగ్యము విష్ణు కథ”.

ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ అన్ని మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. అలానే రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. నెంబర్ నైబరింగ్ కాన్సప్ట్ తో వస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న థియేటర్స్ లో భారీగా విడుదల కాబోతుంది. ఈ తరుణంలో సినిమా ప్రోమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా “వినరో భాగ్యము విష్ణు కథ” చిత్ర యూనిట్ తిరుమల శ్రీ వేంటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

ఈ సినిమా ఎక్కువ శాతం తిరుపతిలోనే జరిగింది. ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను కూడా తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. సినిమా ప్రొమోషన్స్ మొదలు పెట్టినప్పటినుండి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది చిత్ర యూనిట్. కళా తపశ్వి కే విశ్వనాధ్ గారిచే “వాసవ సుహాస” పాటను లాంచ్ చేయడం. అలానే నిన్న జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్ లో పన్నెండు తరాలకు సంబంధించిన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారసులను సన్మానించడం విశేషం.

ఒకవైపు సామాన్య ప్రజలచే సాంగ్స్ లాంచ్ చేయించడంతో పాటు, మరోవైపు పెద్దలకు తగిన గౌరవం ఇస్తూ వాళ్ళతో కొన్ని పాటలను లాంచ్ చేయించడం ఈ చిత్ర యూనిట్ ప్రత్యేకత. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ సభ్యుల మన్ననలు పొంది U/A సర్టిఫికెట్ ను సాధించుకుంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ సినిమాను, GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా, అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.

Exit mobile version