Site icon TeluguMirchi.com

50 మిలియ‌న్ వ్యూయింగ్ మినిట్స్‌తో జీ 5లో దూసుకెళ్తోన్న ‘విమానం’..


సినిమాలు, వెబ్ సిరీస్, టాక్ షోస్‌తో వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ మాధ్య‌మం జీ 5. ఇప్పుడు జీ 5 లైబ్రరీలో డిఫ‌రెంట్ మూవీగా ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ‘విమానం’ మూవీ చేరింది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌) ‘విమానం’ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 22 నుంచి ‘విమానం’ సినిమా జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది.

తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం, ప్రేమానురాగాలు ప్రధానంగా తెర‌కెక్కిన ఈ మూవీ ప్రేక్ష‌కులతో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌ట‌మే కాకుండా ఈ మ‌ధ్య కాలంలో ఇంత‌లా హార్ట్ ట‌చింగ్ మూవీ రాలేద‌ని అంద‌రూ అప్రిషియేట్ చేశారు. అంతేకాదు అంద‌రినీ అల‌రిస్తూ 50 మిలియ‌న్ వ్యూయింగ్ మినిట్స్‌తో సినిమా దూసుకెళ్తోంది.

ఇకపోతే కథ విషయానికొస్తే హైదరాబాద్ బ‌స్తీలో వీరయ్య (స‌ముద్ర‌ఖ‌ని) అనే వ్య‌క్తికి కాలు ఉండ‌దు. భార్య చ‌నిపోవ‌టంతో ఒక్కాగానొక్క కొడుకు (మాస్ట‌ర్ ధ్రువ‌న్‌)ని ఎంతో ప్రేమ‌గా పెంచుకుంటాడు. ఆ చిన్న పిల్లాడికి విమానం ఎక్కాల‌నే కోరిక ఉంటుంది. బాగా చ‌దువుకుంటే విమానం ఎక్క‌వ‌చ్చున‌ని వీర‌య్య కొడుకుతో చెబుతూ ఉంటాడు. అంతా స‌వ్యంగా సాగుతున్న స‌మయంలో వారి జీవితాలు అనుకోని ఘ‌ట‌న‌తో మ‌లుపులు తిరుగుతాయి. కొడుకుని విమానం ఎక్కించాల‌ని వీర‌య్య ఎంతో త‌ప‌న ప‌డుతుంటాడు. అస‌లు వీర‌య్య అలా చేయ‌టానికి కార‌ణ‌మేంటి? కొడుకు కోరిక‌ను వీర‌య్య తీర్చాడా? వీర‌య్య‌తో పాటు అదే కాల‌నీలో ఉండే కోటి, సుమ‌తి, డేనియ‌ల్ ఏం చేస్తుంటారు? అనేదే విమానం సినిమా.

Exit mobile version