విక్రమ్ ను వేరే లెవెల్ లో ప్రెజెంట్ చేసాడుగా !


తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. తన పాత్ర కోసం ఎలాంటి సాహసాలైన చేస్తుంటారు విక్రమ్. కాగా పా. రంజిత్ ద‌ర్శ‌కత్వంలో విక్ర‌మ్ న‌టిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ డ్రామా ‘తంగ‌లాన్‌’. నేడు చియాన్ విక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ సినిమా కి సంబందించిన మేకింగ్ వీడియో ను విడుదల చేయడం జరిగింది.

ఇక ఈ మేకింగ్ వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రతి ఒక్క యాక్షన్ సీన్ కూడా గూస్ బంప్స్ తెచ్చేలా ఉన్నాయి. విక్రమ్ తన భూమిని అణచివేతదారుల నుండి రక్షించడానికి బయలుదేరిన నాయకుడి లా కనిపించాడు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం కోసం విక్రమ్ చాలా కష్టపడినట్లు వీడియోను చూస్తే అర్ధం అవుతుంది. వీడియో లోని విజువల్స్ చాలా అద్బుతం గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.

ఇక కెఇ జ్ఞానవేల్ రాజా తన స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళ‌వికా మోహ‌న‌న్, మ‌ల‌యాళ న‌టి పార్వ‌తీ తిరువొత్తు హీరోయిన్ లు గా నటిస్తోన్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలే వున్నాయి.