Site icon TeluguMirchi.com

విక్రమ్ హాలీవుడ్ హీరో అయ్యాడే..

గత కొంత కాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న విక్రమ్..ఈ మధ్యనే సామీ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అంచనాలను అందుకోలేక ప్రేక్షకులను, అభిమానులను నిరాశ పరిచింది. ప్రస్తుతం విక్రమ్, రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వంలో ‘కదరం కొండన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను దీపావళి రోజున చిత్ర యూనిట్ విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ కు అభిమానులను, ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. విక్రమ్ లుక్ హాలీవుడ్ హీరో లుక్ లో ఉందని, సినిమా ఫై మరింత అంచనాలు పెంచేలా ఫస్ట్ లుక్ ఉందని కామెంట్స్ వినిపిస్తున్నారు.

హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘డోంట్ బ్రీత్’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్షరా హాసన్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. ట్రైడెంట్ ఆర్ట్స్ మరియు కమల్ హాసన్ హోమ్ బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థలు కలిసి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Exit mobile version