Site icon TeluguMirchi.com

ఫస్ట్ లుక్ ఇదేనా?

vikramదర్శకుడు శంకర్, విక్రమ్ ను ‘మనోహరుడు’ గా చూపించే పనిలో బిజీగా వున్నాడు. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తమిళం తో ‘ఐ’ అనే టైటిల్ తో రూపొందుతుంది ఈ చిత్రం. మూడు విభిన్న పాత్రలతో విక్రమ్ ఈచిత్రం లో కనిపించానున్నాడని టాక్. అయితే అఫీషియల్ గా ఇందుకు సంభందించి ఎలాంటి లుక్ ఇప్పటి వరకు విడుదలకాలేదు. శంకర్ కూడా పాత్రల సుస్పెన్స్ మేంటైన్ చేయడానికి ఎలాంటి లుక్ బయటకి రాకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంభందించిన ఓ లుక్ నెట్ లో హాల్ చల్ చేస్తోంది. విక్రమ్ ఈ లుక్ గుండు కనిపిస్తున్నాడు. ‘ఐ’ లో విక్రమ్ ఓ గెటప్ లుక్ ఇదే అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అధికారికంగా రిలీజ్ చేయనప్పటికీ ఇదే విక్రం ‘ఐ’ ఫస్ట్ లుక్ గా నెట్ లో తెగ తిరిగేస్తోంది. ఈ లుక్ పై మీరు ఓ లుక్కేసుకోండి…

Exit mobile version