‘జనతా గ్యారేజ్’ ఫై కన్నేసిన తమిళ హీరో..

vijay-janathaఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ‘ జనతా గ్యారేజ్ ‘. అభిమానుల్లోనే కాదు పక్క ఇండస్ట్రీ లలోని హీరోలకూడా ఈ చిత్రం ఫై మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొన్నా ఈ చిత్రం రేపు ఆడియో వేడుక జరుపుకుందుకే సిద్ధం అయ్యింది. ఇదిలా ఉంటె ఈ సినిమా తమిళ రైట్స్ ఫై తమిళ తలైవా విజయ్ కన్నేసాడాని తెలుస్తుంది.

ఈ చిత్రం మొదలయిన దగ్గరి నుండి ప్రతిదాని గురించి విజయ్ ఆరా తీయడం మొదలు పెట్టాడట. చెన్నై లో షూటింగ్ జరిగేటప్పుడు కూడా షూటింగ్ స్పాట్ కు వచ్చి చిత్ర విశేషాలను అడిగి తెలుసుకోవడం జరిగిందట. ఇప్పుడు తన దగ్గరి నిర్మాతలతో తమిళ రైట్స్ కోసం ట్రై చేస్తున్నాడని సమాచారం.

మిర్చి , శ్రీమంతుడు వంటి రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కొరటాల , ఇప్పుడు జనతా గ్యారేజ్ చిత్రాన్ని కూడా వాటికీ తలదన్నేలా తీసిఉంటాడని అందరూ నమ్ముతున్నారు. ఇప్పటివరకు బయటకు వచ్చిన పిక్స్ , టీజర్ చూస్తే అలానే అర్ధమవుతుంది. ఇక సాంగ్స్ బయటకు వస్తే సినిమా ఫై ఇంకాస్త అంచనాలు పెరిగిపోతాయని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు. ఏ మాత్రం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన ఇప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. చూద్దాం మరి కొరటాల ఏం చేస్తాడో.