Site icon TeluguMirchi.com

NKR21 : మళ్ళీ ‘వైజయంతి IPS’ గా విజయశాంతి.. ఫస్ట్ లుక్ అదుర్స్ !


నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్ర‌దీప్ చిలుకూరి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న చిత్రం #NKR21. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. దీనిని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ స్థాయిలో జరుగుతోంది. కాగా, ఈ సినిమాలో లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి ఓ కీల‌క పాత్ర‌లో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈరోజు విజయశాంతి బర్త్ డే సందర్భంగా.. ఆమె ఫస్ట్ లుక్ తో పాటు, స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసారు మేకర్స్.

CM Revanth Reddy : ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీపడే అవకాశం నాకు వచ్చింది : సీఎం రేవంత్‌రెడ్డి

‘వైజయంతి IPS’ గా విజయశాంతి ఫస్ట్ లుక్ అదిరిపోయింది. అప్పట్లో ‘కర్తవ్యం’ సినిమాలో వైజయంతి IPS అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన విజయశాంతి మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో అదే పేరుతో, అదే రోల్ లో, అంతే పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ఇక గ్లింప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. “వైజ‌యంతి IPS.. త‌ను ప‌ట్టుకుంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వ‌స్తుంది.. వేసుకుంటే యూనిఫాంకు పౌరుషం వ‌స్తుంది.. త‌నే ఒక యుద్ధం.. నేనే త‌న సైన్యం..” అంటూ క‌ళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఈ వీడియో చూసిన అభిమానులైతే లేడీ సూపర్ స్టార్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. ఇక సాయి మంజ్రేక‌ర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అజ‌నీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీకాంత్, సోహెల్ ఖాన్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో నటిస్తున్నారు.

Vijayashanthi Birthday Glimpse - #NKR21| Nandamuri Kalyanram | Saiee Manjrekar | Ashoka Creations

Exit mobile version