Site icon TeluguMirchi.com

విజిల్ టాక్ ..

‘తెరి’ ‘మెర్సల్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత విజయ్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘బిజిల్’ ( తెలుగు లో విజిల్). నయనతార విజయ్ కి జోడిగా నటించగా.. కతిర్, యోగిబాబు, వివేక్, జాకీష్రాఫ్, ఇందుజా రవిచంద్రన్, ఆనంద్ రాజ్, మోనికా జాన్ తదితరులు నటించారు.

ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించగా.. ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై అఘోరం కల్పతి సుబ్రమణ్యన్ నిర్మించారు. తెలుగులో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మహేష్ ఎస్. కోనేరు ఈ చిత్రాన్ని విడుదల చేశారు. దీపావళి సందర్భంగా ఈరోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఇక మూవీ టాక్ ఎలా ఉందనేది చూస్తే..

ఫస్టాఫ్ కేక పుట్టించిందని.. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ అయితే విజయ్ అభిమానులకు బాగా నచ్చుతుందని.. విజయ్ కెరీర్‌లో రాయప్పన్ పాత్ర ది బెస్ట్ అని చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. నయనతార చాలా క్యూట్‌గా ఉందని అంటున్నారు. ఇక మైఖేల్ పాత్రలో విజయ్ ఎప్పటిలానే చాలా హుషారుగా తన మ్యానరిజంతో అలరించారట. రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ అంటున్నారు.

ఈ సినిమాలో విజయ్ రెండు పాత్రల్లో నటించారు. ఒకటి తండ్రి పాత్ర రాయప్పన్.. రెండోది కొడుకు పాత్ర మైఖేల్ అలియాస్ విజిల్. ఒక ఛాంపియన్ ఫుట్‌బాలర్ జీవితం తన స్నేహితుడి మరణంతో ఎలా మలుపు తిరిగింది.. ఆ తరవాత అతను మహిళా ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌‌గా ఎందుకు వెళ్లాడు.. ఆ క్రమంలో అతనికి ఎదురైన అవరోధాలు ఏంటి అనేది సినిమా కథ గా తెలుస్తుంది.

Exit mobile version