విజయ్‌ మైనపు విగ్రహం

తమిళ స్టార్ స్టార్ హీరో విజయ్ క్రేజ్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు గుడి కట్టేసిన అభిమానులు వున్నారు. తాజగా ఆయన మైనపు విగ్రహం ను ఏర్పాటు చేస్తున్నారు.

చెన్నైలో బిహైండ్‌వుడ్స్‌ గోల్డ్‌ మెడల్స్‌ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో విజయ్‌కి ‘సామ్రాట్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియన్‌ బాక్సాఫీస్‌’ అవార్డు వచ్చింది. అయితే విజయ్‌ ఇలాంటి కార్యక్రమాలకి హాజరవడానికి ఇష్టపడరు. కానీ ఆన్‌లైన్‌ పోల్‌లో 66 శాతం ఓట్లు విజయ్‌కే రావడంతో ఆయన అవార్డు అందుకోవడానికి ఈవెంట్‌కి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలోనే విజయ్‌ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ విజయ్ ని చూడటానికి జనాలు ఎగబడ్డారు. ప్రస్తుతం ఆట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు విజయ్. ఈ సినిమాలో సమంత హీరోయిన్.