ఆ మెగా మూవీ నుండి విజయ్‌ తప్పుకోలేదట

మెగా బ్రదర్స్‌ మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. ఈ చిత్రంలో కీలక పాత్రను విజయ్‌ సేతుపతి చేస్తున్నట్లుగా మొదటి నుండి వార్తలు వచ్చాయి. అయితే షూటింగ్‌లో ఇంకా కూడా విజయ్‌ సేతుపతి పాల్గొనకపోవడంతో అసలు ఈ చిత్రంలో ఆయన లేడు అంటూ ప్రచారం జరిగింది. విజయ్‌ సేతుపతి చివరి నిమిషంలో తప్పుకున్నాడని, ఆయన స్థానంలో సంపత్‌ను తీసుకున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. కాని మొన్నటి వరకు వచ్చిన వార్తలు కేవలం పుకార్లే అంటూ క్లారిటీ వచ్చేసింది.

ఉప్పెన షూటింగ్‌లో నేటి నుండి వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి విజయ్‌ సేతుపతి పాల్గొంటున్నాడు. హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో భారీ ఎత్తున ఏర్పాటు చేసి సెట్టింగ్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. దాదాపు రెండు వారాల పాటు ఈ షెడ్యూల్‌ ఉంటుందట. ఆ తర్వాత మరో షెడ్యూల్‌లో విజయ్‌ సేతుపతి నటిస్తే ఆయన పార్ట్‌ పూర్తి అవుతుందట. సినిమాలో ఆయన కనిపించేది కొద్ది సమయమే అయినా తప్పకుండా అది సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుందని అంటున్నారు. మరి ఈ చిత్రంతో వైష్ణవ్‌ తేజ్‌ ఏమేరకు ఆకట్టుకుంటాడు, సక్సెస్‌లో విజయ్‌ సేతుపతి పాత్ర ఎంత ఉంటుందనేది చూడాలి.