Site icon TeluguMirchi.com

సైరా లో విజయ్ -సుదీప్ ఎలా ఉన్నారో చూడండి

మెగాస్టార్ చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి ‘. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మెగా పవర్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. చిరంజీవి కి జోడిగా నయనతార నటిస్తుండగా బిగ్ బి అమితాబ్ , విజయ్ సేతుపతి , జగపతి బాబు , బ్రహ్మాజీ , సుదీప్ వంటి సీనియర్ నటులు నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జార్జియా దేశంలో గత కొన్ని రోజులుగా జరుగుతుంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ల ఆధ్వర్యంలో సుమారు 500 మంది ఫై భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుదీప్ , విజయ్ సేతుపతి లుక్స్ బయటకొచ్చాయి. ఇద్దరు కలిసి ఉన్న పిక్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. ఇద్దరి గెటప్ చూసి అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

బ్రిటిష్ సైనికులతో ఈ యుద్ధం జరగబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. కొణెదల ప్రొడక్షన్ బ్యానర్ ఫై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా , బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version