విజయ్ దేవరకొండ తెరపైకి వచ్చాడు. మొదటి సారి కరోనా పై స్పదించాడు. మాస్కుల్ని ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు, సిబ్బందికి వదిలేయాలని కోరాడు విజయ్ దేవరకొండ. కరోనా నేపథ్యంలో సెలబ్రిటీలంతా కలిసి ‘మాస్క్ ఇండియా’కు శ్రీకారం చుట్టారు.
ఇందులో బాగంగా విజయ్ ట్విటర్‌లో మాట్లాడుతూ.. ‘మై లవ్స్.. మీరంతా జాగ్రత్తగా ఉన్నారని అనుకుంటున్నా. వస్త్రంతో ముఖాన్ని కవర్ చేసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని దాదాపు అడ్డుకోవచ్చు. వ్యాధి తక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. మెడికల్ మాస్కుల్ని వైద్యులకు వదిలేయండి. మీరు వాటికి బదులు చేతి రుమాలు, స్కార్ఫ్ లేదా మీ అమ్మ చున్నీని వాడండి. మీ ముఖాన్ని కవర్ చేయండి.. సురక్షితంగా ఉండండి’ అంటూ #MaskIndia ట్యాగ్‌ను పోస్ట్ చేశాడు విజయ్.