Site icon TeluguMirchi.com

ఆశలన్నీ పూరి పైనే..

పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాలతో వరుస హిట్లు అందుకున్న విజయ్ దేవరకొండ..ఆ తర్వాత వరుస ప్లాప్స్ తో అభిమానులను నిరాశ పరుస్తూ వస్తున్నాడు. తాజాగా క్రాంతి మాధవ్ డైరెక్షన్లో నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సైతం డిజాస్టర్ గా మిగిలి విజయ్ ఖాతాలో మరో ప్లాప్ గా చేరింది. ఇప్పుడు విజయ్ తో పాటు అభిమానుల ఆశల్లాని పూరి డైరెక్షన్లో చేస్తున్న సినిమా పైనే.

విజయ్ ని పాన్ ఇండియా స్టార్ ని చేయాలని.. బ్లాక్ బస్టర్ కొట్టాలని పూరి- చార్మి బృందం సర్వసన్నాహకాల్లో ఉన్నారు. ఫైటర్ చిత్రం కాన్వాసును ముంబైలో సెట్ చేసి సీరియస్ గా వర్కవుట్ చేస్తున్నారు. దేవరకొండ సహా కీలక తారాగణంపై ప్రస్తుతం చిత్రీకరణ సాగుతోంది. మొన్నటి వరకు ఓ లెక్క..ఇప్పుడు ఓ లెక్క అన్నట్లు పూరి జాగ్రత్తపడుతున్నాడట. ఎలాగైనా హిట్ ఇవ్వాలని విజయ్ పూరి ఫై ఒత్తిడి తెస్తున్నాడట. పూరి కూడా ఇస్మార్ట్ తో వచ్చిన పేరును పోగొట్టుకోకుండా వర్క్ చేస్తున్నాడట. మొత్తం మీద విజయ్ భారం అంత పూరి పైనే.

Exit mobile version