Site icon TeluguMirchi.com

‘మహానటి’లో పెళ్లిచూపులు హీరో

దర్శకుడు నాగఅశ్విన్‌ అలనాటి తార సావిత్రి జీవిత చరిత్రను తెరకెక్కించడానికి ఏడాదిన్నర కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్టును రెడీ చేసిన నాగఅశ్విన్‌ ప్రస్తుతం నటీనటుల ఎంపిక చేస్తున్నాడు. ఈ చిత్రంలో మహానటిగా కీర్తి సురేష్‌ను ఎంపిక చేశాడు. ‘మహానటి’ పాత్రను పరిచయం చేసే జర్నలిస్ట్‌గా సమంత నటించనుంది. ఈ చిత్రంలో ‘పెళ్లి చూపులు’ హీరో విజయ్‌దేవర కొండ కూడా నటించనున్నాడు. ఓ కీలక పాత్ర కోసం విజయ్‌ దేవరకొండను ఎంపిక చేసినట్టు తాజాగా సమాచారం అందుతోంది.

‘మహానటి’ చిత్రంలో సమంతకు వ్యతిరేకంగా ఉండే పాత్రలో విజయ్‌ నటించనున్నాడు. యూత్‌లో క్రేజీ స్టార్‌గా గుర్తింపును సొంతం చేసుకున్న విజయ్‌ దేవరకొండకు ఈ చిత్రంలో అవకాశం రావడంతో అభిమానులు చాలా సంబరపడుతున్నారు. అందుకే చిన్న పాత్ర అయినా కూడా కీలకంగా ఉండడంతో విజయ్‌ వెంటనే ఒకే చేశాడట. ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్‌ అశ్వినిదత్‌ నిర్మించనున్నాడు. సావిత్రి వ్యక్తిగత విషయాలను కూడా తెలుసుకుని ఆసక్తికలిగించే కథగా ‘మహానటి’ని తెరకెక్కించనున్నారు.

Exit mobile version