Keedaa Cola : ‘కీడా కోలా’ ప్రీ-రిలీజ్ కోసం ఫ్యామిలీ స్టార్ !


దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం మూడవ చిత్రం కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. 2వ తేదీన యుఎస్ఎ, కొన్ని ఇతర ప్రాంతాలలో ప్రీమియర్లు ప్రదర్శించబడతాయి. ఇదిలా ఉంటే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

ఈ క్రమంలో రేపు హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఈవెంట్‌కి ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరౌతున్నారు. విజయ్ దేవరకొండకు యూత్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని ప్రజన్స్ ఈవెంట్‌ను స్మాసింగ్ హిట్‌గా మార్చి సినిమాకు ఎడిషనల్ బజ్‌ని సంపాదించడంలో సహాయపడుతుంది.

ఈ చిత్రంలో బ్రహ్మానందం వరదరాజులు తాతగా, చైతన్యరావు వాస్తుగా, రాగ్ మయూర్‌గా లాంచమ్‌గా, తరుణ్‌గా నాయుడుగా, సికిందర్‌గా విష్ణుగా, జీవన్‌కుమార్‌గా జీవన్‌రవీంద్ర విజయ్‌గా, షాట్స్‌గా రఘురామ్‌గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందించారు.