Site icon TeluguMirchi.com

‘న్యూడ్‌ ఫొటోషూట్‌’కు సై అంటున్న లైగర్

విజయ్ దేవరకొండ ‘న్యూడ్‌ ఫొటోషూట్‌’కు సై అంటున్నాడు. ఈ మధ్య హీరోయిన్లే కాదు హీరోలు సైతం న్యూడ్ ఫోటో షూట్స్ తో హల్చల్ చేస్తున్నారు. రణవీర్ , నందు , విష్ణు విశాల్ తదితరులు న్యూడ్ ఫోటో షూట్స్ తో ఇప్పటికే వార్తల్లో నిలువగా..విజయ్‌ దేవరకొండ సైతం సై అంటున్నాడు.

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘లైగర్‌’ కోసం మొదటిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న.. విజయ్ దేవరకొండ, అనన్య పాండే ‘కాఫీ విత్‌ కరణ్‌ షో’ ఏడో సీజన్‌ నాలుగో ఎపిసోడ్​లో పాల్గొన్నారు. ఈ షోలో విజయ్​కు కరణ్‌ బోల్డ్‌ ప్రశ్నలు అడిగారు. అటు విజయ్ కూడా ఏమాత్రం తడబడకుండా అంతే బోల్డ్‌గా సమాధానాలు ఇచ్చారు. ర్యాపిడ్‌ ఫైర్‌ రౌండ్‌లో విజయ్‌ని కరణ్‌ అడుగుతూ.. ‘ఇంటర్నేషనల్‌ మ్యాగజైన్‌కు న్యూడ్‌గా పోజ్‌ ఇస్తావా?’ అని అన్నారు. వెంటనే విజయ్‌.. ‘బాగా తీస్తే న్యూడ్‌గా పోజులివ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు’ అని చెప్పారు. ఇక ‘ఇండియాలో మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్​ ఎవరు అనుకుంటున్నావ్‌?’ అని అడిగితే.. మరో ఆలోచన లేకుండా సమంత పేరు చెప్పి షాక్ ఇచ్చాడు విజయ్. ప్రస్తుతం విజయ్ చేసిన ఆన్సర్లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Exit mobile version