Site icon TeluguMirchi.com

ఫొటోటాక్‌ : పిల్లలతో చిల్‌ అవుతున్న దేవరకొండ

విజయ్‌ దేవరకొండ సోషల్‌ మీడియాలో పెట్టిన ఈ ఫొటో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వరుస సినిమాలతో బిజీగా గడుపుతూ, పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ మరో వైపు నిర్మాణం కూడా చూసుకుంటున్న విజయ్‌ దేవరకొండ పిల్లలతో సరదాగా బోర్డ్‌ గేమ్స్‌ ఆడటం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. విజయ్‌ దేవరకొండ హడావుడిగా ఉంటాడని, ఆయన ఇంట్లో ఎక్కువ సమయం గడపడని అంతా అనుకుంటూ ఉంటారు. కాని విజయ్‌ దేవరకొండ సమయం చిక్కినప్పుడల్లా పిల్లలతో సమయం గడుపుతాడు.

ఈ ఫొటోలో విజయ్‌ దేవరకొండతో పాటు తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ కూడా ఉన్నాడు. వీరిద్దరు పిల్లలతో కలిసి ఆడుతూ ఉన్నారు. గేమ్‌ ఏదో సరదాగా ఆడుతున్నట్లుగా కాకుండా గేమ్‌ లో లీనం అయ్యి మరీ చాలా సీరియస్‌గా అందరు మొహాలు పెట్టుకుని ఆడుతున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే విజయ్‌ దేవరకొండ పిల్లలతో ఎంతగా కలిసి పోతాడు అనేది అర్థం అవుతుంది. విజయ్‌ దేవరకొండ వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ వెంటనే పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో ‘ఫైటర్‌’ అనే చిత్రాన్ని చేయబోతున్నాడు.

Exit mobile version