Site icon TeluguMirchi.com

రౌడీ తగ్గడం ఈ సినిమాతోనే షురూనా?

విజయ్‌ దేవరకొండ ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంకు ముందు ఓ రేంజ్‌ స్టార్‌. అర్జున్‌ రెడ్డి విడుదలైనప్పటి నుండి డియర్‌ కామ్రేడ్‌ వరకు విజయ్‌ దేవరకొండ మూవీస్‌ అంటే అదో గొప్ప విషయం. ఈ రెండు సంవత్సరాలు ఆయన ఆట సాగింది. ఏం చేసినా, ఎంత చెప్పినా అంత సాగింది. ఈ రెండేళ్లలో పూరి మరియు ఛార్మి పలు సార్లు విజయ్‌ దేవరకొండను కలిసేందుకు ప్రయత్నించగా, కనీసం అపాయింట్‌మెంట్‌ ఇవ్వనంతగా విజయ్‌ దేవరకొండ గేమ్‌ ఆడాడు. కాని డియర్‌ కామ్రేడ్‌ చిత్రం ఎప్పుడైతే పోయిందో అప్పటి నుండే విజయ్‌ దేవరకొండ సాదారణ హీరో అయ్యాడు.

మొన్నటి వరకు పూరితో మూవీకి నో చెప్పి, కొరటాల శివ వంటి స్టార్‌ డైరెక్టర్స్‌ వైపు చూసిన ఈయన ఉన్నట్లుండి ఒక్కసారిగా పూరి వైపు రావడం అంటే ఖచ్చితంగా రౌడీ గారి బ్రాండ్‌ పడిపోయిందనే అనుకోవాలి. అది ఎంతగా అనేది తాజా అనౌన్స్‌మెంట్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఛార్మి ఉంటే సినిమా చేయము అంటూ కొందరు నేరుగా పూరి జగన్నాధ్‌తో అంటున్నారు. గతంలో విజయ్‌ దేవరకొండ కూడా సన్నిహితుల వద్ద పూరితో ఛార్మి ఉంటే చేయను అంటూ అన్నవాడే. కాని ఇప్పుడు అదే ఛార్మి నిర్మాణంలో సినిమాను చేయబోతున్నాడు. రౌడీ తన అటిట్యూడ్‌ను తగ్గించుకోవడం మొదలు పెట్టాడు అనేందుకు ఇదే నిదర్శణం. ముందు ముందు మరెంతగా తగ్గించుకుంటాడో చూడాలి.

Exit mobile version