చిక్కుల్లో పడ్డ విజయ్ దేవరకొండ..

వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న విజయ్ దేవరకొండ..ప్రస్తుతం పూరి డైరెక్షన్లో పాన్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ లో విజయ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఇందుకోసం విజయ్ విదేశాలలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇక ఈ మూవీ కోసం విజయ్ బాడీ మేకోవర్ చేయాల్సి ఉండగా కరోనా కర్ఫ్యూ కారణంగా అన్ని జిమ్ సెంటర్ లు బంద్ చేయడం జరిగింది.

ఇంట్లో సరిపడా జిమ్ ఎక్విప్ మెంట్ లేకపోవడంతో పాటు నిపుణుల పర్యవేక్షణ లేక విజయ్ ఇబ్బంది పడుతున్నాడట. ఈ లాక్ డౌన్ ఇంకా చాల రోజులు కొనసాగేలా ఉన్న నేపథ్యంలో ఆయనకు ఏమి చేయాలో అర్ధం కావడం లేదు. పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.