విజయ్ దేవరకొండ ప్రస్తుతం హీరోగా స్టార్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. తనకు మొదటి సక్సెస్‌ను ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేస్తూ విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అనసూయ ఇందులో ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్రానికి ‘మీకు మాత్రమే చెప్తా’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా ప్రకటించారు. టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మీడియం రేంజ్ బడ్జెట్‌తో కొత్త దర్శకుడితో విజయ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.
ఇక రేపు ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే టీజర్ ఎడిటింగ్ పూర్తి అయ్యింది. పలు వర్షన్ల నుండి ఫైనల్‌గా ఒకటి పూర్తి చేశారు. టీజర్లో సినిమా థీమ్‌ను చూపించాలనే ఉద్దేశ్యంతో కాస్త ఎక్కువ నిడివితోనే టీజర్‌ను ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. రేపు అంటే సెప్టెంబర్ 7వ తారీకున సాయంత్రం 6 గంటల 2 నిమిషాలకు టీజర్‌ను ఆన్లైన్లో ఉంచబోతున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కూడా ఉండే అవకాశం ఉంది. నిర్మాతగా విజయ్ సక్సెస్‌ను దక్కించుకుంటాడో చూడాలి.