విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా సూపర్ స్టార్ రేంజ్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ హీరోగా విజయ్ పేరు దక్కించుకున్నాడు. ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండతో ఒక బాలీవుడ్ సినిమా చేయాలని కరణ్ జోహార్ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికి ఆ విషయంపై ఒక క్లారిటీ వచ్చింది. విజయ్ దేవరకొండ బాలీవుడ్ మూవీ కన్ఫర్మ్ అయ్యింది.
ఈనెల 6వ తారీకున విజయ్ దేవరకొండ బాలీవుడ్ మూవీ అఫిషియల్ ప్రకటన రాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. హిందీతో పాటు సౌత్‌లో అన్ని భాషల్లో కూడా ఈ చిత్రంను తెరకెక్కిబోతున్నారు. తెలుగులో ప్రత్యేకమైన దర్శకుడు కూడా ఉంటాడని తెలుస్తోంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లో కూడా ఈ చిత్రంకు ఒకే టైటిల్ ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కరణ్ జోహార్ ఈ చిత్రంను ఈనెల 6న ప్రకటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.