Site icon TeluguMirchi.com

విజయ్ ఏంటి ఆలా చేసాడు..?

విజయ్ దేవరకొండ ఈ పేరు వింటే చాలు యూత్ ఊగిపోతున్నారు..కేవలం నాల్గు సినిమాలతో స్టార్ హీరో రేంజ్ పాపులార్టీ సొంతం చేసుకున్నాడు. కేవలం సినిమాల పరంగానే కాకుండా వ్యక్తి గతంగా కూడా విజయ్ అందరికి దగ్గరయ్యాడు. ఏ విషయంపైనైనా క్లారిటీ గా ఉంటె విజయ్..తన తమ్ముడి విషయంలో మాత్రం ఆ క్లారిటీ మిస్ అయ్యాడనే విమర్శలు ఎదురుకుంటున్నాడు.

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన దొరసాని టీజర్ రీసెంట్ గా రిలీజైంది. ఈ టీజర్ పై విజయ్ దేవరకొండ స్పందిస్తాడని అంతా ఎదురుచూశారు. కానీ దొరసానిపై విజయ్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. తమ్ముడి సినిమాకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో విజయ్ ఇలా ప్రవర్తించాడని అంతా అర్థంచేసుకున్నారు. తమ్ముడి సినిమా పట్ల సైలెంట్ గా ఉన్న విజయ్.. ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ సినిమా ట్రయిలర్ ఫై స్పందించడం పట్ల అభిమానులు..నెటిజన్లు కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ్ముడు నటించిన దొరసానిని వదిలేసి, ఈ సినిమాను ప్రచారం చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పట్ల విజయ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Exit mobile version