క్రేజీస్టార్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించనున్న విషయం తెల్పిందే. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్న పూరి ఈ సారి విజయ్‌తో అంతకుమించి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఈ చిత్రంలో పూరి మార్క్‌తో విజయ్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని గతకొంతకాలంగా ప్రచారం అవుతూ వస్తోంది. డాన్ మరియు అతని కొడుకి మద్య జరిగే కథ, డాన్‌గా ఓ సీనియర్ నటుడు, అతని కొడుకుగా విజయ్ నటిస్తాడు అంటూ వైరల్ అవుతున్న విషయం తెల్సిందే. అయితే తాజాగా విజయ్ పాత్రపై ఓ క్లారిటీ వచ్చింది.
ఈ చిత్రంలో విజయ్ తన మార్క్ ప్రేమకథతో రాబోతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా దానికి కొంచెం మసాలా లాగా పూరి మార్క్‌ని జోడించనున్నారట. మరో మంచి ప్రేమకథతోనే విజయ్, పూరీలు తమదైన రీతిలో ప్రేక్షకుల ముందుకు వస్తారని విశ్వసనీయ సమాచారం. అయితే ప్రేమ కథలతో వస్తేనే విజయ్‌కు మంచి సక్సెస్ దక్కుతాయి అని ఆయన గత చిత్రాలను బట్టి తెలుస్తోంది. కాబట్టి కచ్చితంగా లవర్‌బాయ్‌గానే మనోడు రావాలని ఫిక్స్ అయ్యాడట. కాకపోతే అడిషినల్‌గా పూరి స్టయిల్లో ఆ ప్రేమకథ ఉండబోతుండడం ఆసక్తికర విషయమే.