డియర్ కామ్రేడ్ విడుదలై ఫ్లాప్ టాక్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం సక్సెస్ అయితే విజయ్ దేవరకొండ స్థాయి ఎక్కడికో వెళ్లేది. కాని ఆ సినిమా ఫ్లాప్‌తో ఢీలా పడిపోయాడు. అప్పటికే చాలా సార్లు దర్శకుడు పూరి జగన్నాధ్ నుండి ఆఫర్ వచ్చినా తిరష్కరిస్తూ వచ్చాడు. డియర్‌కామ్రేడ్ ఫలితంతో వెంటనే పూరికి ఓకే చెప్పాడు. వీరిద్దరి కాంబినేషన్లో ‘ఫైటర్’ అనే చిత్రం తెరకెక్కబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రటకన కూడా వచ్చేసింది.
ఇప్పుడు ఆ సినిమా గురించిన చర్చ ఒకటి ప్రస్తుతం సినీ వర్గాల్లోమొదలైంది. ఆ చర్చ సారాంశం ఏంటీ అంటే ఈ చిత్రం కథ ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రం కథకు సీక్వెల్లా ఉంటుందట. అవును ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఫైటర్‌గా కనిపించబోతున్నాడు. సీక్వెల్ అధికారికంగా కాకున్నా దర్శకుడు పూరి ఆ చిత్రం కథను బేస్ చేసుకుని అందులోని కొన్ని పాత్రలకు కొనసాగింపు అన్నట్లుగా కథను సిద్దం చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే దర్శకుడు పూరి స్టోరీ లైన్‌తో విజయ్ దేవరకొండను ఒప్పించాడు. ఇక పూరి ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్‌ను సిద్దం చేసే పనిలో ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్‌తో సక్సెస్ కొట్టిన దర్శకుడు పూరి ఈ చిత్రంతో మరో విజయాన్ని దక్కించుకుంటాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.