టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ త్వరలోనే బాలీవుడ్‌కు వెళ్లబోతున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఆమద్య కరణ్ జోహార్ ఏకంగా విజయ్ దేవరకొండను తాను హిందీలో పరిచయం చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ఇలాంటి సమయంలో డియర్ కామ్రేడ్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు కరణ్ జోహార్ రైట్స్‌ను కొనుగోలు చేయడం జరిగింది. దాంతో ఆ రీమేక్‌ను విజయ్ దేవరకొండతోనే కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నాడని, ఈ ఏడాది చివర్లోనే హిందీ డియర్ కామ్రేడ్‌ను తెరకెక్కించబోతున్నట్లుగా పుకార్లు మొదలయ్యాయి.
బాలీవుడ్ ‘డియర్ కామ్రేడ్’లో తాను నటించబోతున్నట్లుగా వస్తున్న వార్తలపై విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు. తనకు ప్రస్తుతం హిందీ చిత్రాల్లో నటించే ఆలోచన లేదని, భవిష్యత్తులో నటిస్తానంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సౌత్‌పైనే తన పూర్తి దృష్టి అంటూ కూడా చెప్పుకొచ్చాడు. డియర్ కామ్రేడ్ అక్కడి హీరోతోనే రీమేక్ అవ్వబోతుందని, అది ఎవరు అనేది కరణ్ జోహార్ నిర్ణయించబోతున్నట్లుగా కూడా విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డియర్ కామ్రేడ్‌ను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు కరణ్ జోహార్ సిద్దం అవ్వగా పలువురు యంగ్ హిందీ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. కబీర్ సింగ్ ఎఫెక్ట్‌తో డియర్ కామ్రేడ్‌కు అక్కడ మంచి క్రేజ్ ఉంది.