టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ, హీరోయిన్ కియారా అద్వానీ జంటగా ఒక చిత్రం తెరకెక్కబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఈ విషయమై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరితో సినిమా చేయబోతున్నది బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో బాలీవుడ్‌కు ఇప్పుడే కాదు అంటూ విజయ్ దేవరకొండ ప్రకటించాడు. దాంతో హిందీ సినిమాల్లో విజయ్ ఇప్పట్లో నటించడని తేలిపోయింది. కాని తాజాగా మరోసారి ఆ వార్తలు జోరందుకున్నాయి.
విజయ్ దేవరకొండ ఇంకా కిరాయా అద్వానీలు బాలీవుడ్ ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా స్టూడియో నుండి బయటకు రావడం మీడియా కంట పడింది. ఆ సమయంలోనే వారితో పాటు కరణ్ జోహార్ కూడా ఉన్నాడు. ఇద్దరిపై ఫొటో షూట్ చేశారనే టాక్ వస్తుంది. సినిమా లేదన్న విజయ్ దేవరకొండ ఫొటో షూట్ ఎందుకు ఇచ్చాడనే టాక్ వస్తోంది. వీరిద్దరితో కరణ్ జోహార్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే వారిద్దరితో స్క్రీన్ టెస్టు మరియు కాస్ట్యూమ్స్ టెస్టు చేయించాడని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ విషయంలో నిజం ఎంతో మరోసారి విజయ్ దేవరకొండ స్పందిస్తే కాని తెలియదు.