Site icon TeluguMirchi.com

విజయ్ ను అరెస్ట్ చేయబోతున్నారా..?

ప్రస్తుతం తమిళనాట ఇదే చర్చ జరుగుతుంది. గత రెండు , మూడు రోజులుగా తమిళ సినీ ప్రముఖుల ఇళ్లఫై ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా విజయ్ ఇంటిపై , ఆఫీస్ లపై ఐటీ దాడులు జరగడం వెనుక బిజెపి నే కారణమని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రాజకీయ పార్టీల నాయకులు నటుడు విజయ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.

విజయ్‌ నటించిన మెర్శల్‌ చిత్రంలో ఉచిత వైద్యం, జీఎస్‌టీ వంటి సన్నివేశాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుట్లో వీటిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే బిగిల్‌ చిత్ర ఆడియో వేడుకలో నటుడు విజయ్‌ అన్నాడీఎంకే నాయకులకు వార్నింగ్‌ ఇచ్చే విధంగా మాట్లాడారు. ఇలా పలు సంఘటనలు చోటు చేసుకోవడం తో బిజెపి విజయ్ ని టార్గెట్ చేసిందని ప్రచారం అవుతుంది. అలాగే విజయ్ ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని అంత మాట్లాడుకోవడం అభిమానుల్లో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది.

Exit mobile version