బిచ్చగాడు 2 ఓటిటీ పార్ట్నర్ లాక్..


విజ‌య్ ఆంటోనీ హీరోగా నటించిన ‘బిచ్చగాడు’ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌రువాత ‘బిచ్చాగాడు 2’ తో మ‌రో సారి ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. అయితే ఈ సారి హీరోగా, క‌థ‌కుడిగా, ఎడిట‌ర్‌గా, ద‌ర్శ‌కుడిగా ఈ మూవీకి ప‌ని చేశారు. భారీ అంచ‌నాల మ‌ధ్య శుక్ర‌వారం బిచ్చ‌గాడు -2 ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

అయితే ఈ మూవీ డిజిట‌ల్ రైట్స్‌ను ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద‌క్కించుకుంది. బిచ్చ‌గాడు -2 స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ డిస్నీప్లస్ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు. దీంతో ఈ సినిమాను థియేటర్స్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత హాట్ స్టార్ లో వీక్షించవచ్చు. ఇకపోతే జూన్ మూడో వారంలో బిచ్చ‌గాడు -2 ఓటీటీలో రిలీజ‌య్యే అవ‌కాశం వుంది. ఇక ఈ సినిమాలో కావ్య థాప‌ర్ హీరోయిన్‌గా నటించింది.