బాలీవుడ్ హాట్ బ్యూటి విద్యాబాలన్ ‘బేగం జాన్’ చిత్ర ప్రమోషన్లలో బిజీగా పాల్గోంటుంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో ముచ్చటించిన విద్యాబాలన్‌ను మీరు గర్భవతినా..? అని యాంకర్ ప్రశ్నించగా ఆ యాంకర్ దుమ్ము దులిపేసింది విద్యాబాలన్. ఒక పెళ్లైన మహిళ ఆసుపత్రికి వెళితే గర్భవతినే అని అంతా అనుకుంటారెందుకు…? తనకు మొటిమలు బాగా వచ్చి చికిత్సకు వెళ్లింది అని అనుకోవచ్చుగా అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతేకాకుండా గర్భవతి అనేది నా వ్యక్తిగతం, అలాంటి విషయాలు నేను బయటకు ఎందుకు చెప్పాలి, పిల్లల గురించి నా భర్త నేను మాట్లాడుకుంటాం అందరికి ఎందుకు చెప్పాలి అని ఘాటుగా మాట్లాడింది. మా పిల్లల గురించి నానా హడావుడి అవసరామా..? అయినా ఇండియాలో రహస్యాలకు చోటే ఉండదు అని పెదవి విరిచింది. ఇండియాలో ఇప్పటికే చాలా జనాభా ఉంది, కొందరికి పిల్లలు పుట్టపోతే నష్టం ఏమి ఉండదు అని విద్యా చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది.
అంతేకాకుండా తనకు పెళ్లైన కొత్తలో జరిగిన ఓ అనుభవం చెబుతూ కూడా చాలా ఫైర్ అయ్యింది. పెళ్లైన కొత్తలో నన్ను నా భర్తను కలిసిన మా అంకుల్ మళ్లీ వచ్చే వరకు మీరు ముగ్గురు కావాలి అంటూ డిమాండ్ చేశాడు. అదేంటి నేనేమైనా పిల్లల్ని కనే యంత్రాన్నా…? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తానికి మీరు ఆసుపత్రికి వెళ్లారు ప్రెగ్నెన్సీనా..? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బేగంజాన్ తనదైన రీతిలో క్లాస్ పీకింది.