‘ఉత్తమవిలన్’ విడుదల నిలిపివేయాలి – వీహెచ్ పీ

Uttama-Villain-Release
లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన ‘ఉత్తమవిలన్’ చిత్రం మరో వివాదంలో చిక్కుకుంది . సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో ఈ చిత్రంపై నిషేధం విధించాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) ఆందోళన చేస్తున్నారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, ఓ పాటలోని లిరిక్స్ హిందూవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా ఉండాలంటూ పోలీస్ కమిషనర్‌కు వీహెచ్‌పీ ఓ నివేదికను సమర్పించింది. పాటలో ప్రహ్లాద, హిరణ్య కశిపుడు మధ్య జరిగే చర్చ గురించి వచ్చే లిరిక్స్ వివాదాస్పదంగా ఉన్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేయాలని భావించినప్పటికీ గ్రాఫిక్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో ఏప్రిల్ 24 లేదా మే 1న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. మరి ఈ వివాదంతో ‘ఉత్తమవిలన్’ మరోసారి వాయిదా పడుతుందో లేదు చూడాలి…