Site icon TeluguMirchi.com

సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా “వెయ్ దరువెయ్” టీజర్ విడుదల


నవీన్ రెడ్డి దర్శకత్వంలో సాయి రామ్ శంకర్ హీరోగా రూపొందుతున్న ‘వెయ్ దరువెయ్’ సినిమా టీజర్ ను సుప్రీం సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు మేకర్స్. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ఈ సినిమా టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, సినిమా చూడాలి అన్న కూతుహలాన్ని రేపుతుంది, సినిమా ఖచ్చితంగా తెలుగులో సక్సెస్ అవ్వాలని.. సాయి అన్న కి మరియు డైరెక్టర్ , ప్రొడ్యూసర్ గారికి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. సినిమా లో పని చేసిన వాళ్ళ అందరికి అల్ బెస్ట్ చెప్పారు.

హీరో సాయి రామ్ శంకర్ గారు మాట్లాడుతూ సుప్రీం సాయిధరమ్ తేజ్ గారి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేయటం చాల ఆనందంగా ఉంది. మా సినిమా నుంచి ఇది వరకే రెండు సాంగ్స్ రిలీజ్ అయినవి వాటికీ చాలా మంచి స్పందన వచ్చింది. పాటలు ఎలాగైతే నచ్చాయో ఈ సినిమా టీజర్ అంతకు మించి ఉంది . సినిమా చాలా బాగా వచ్చింది. మీకు తప్పకుండ నచ్చుతుంది అని అన్నారు.

ఇక దర్శకనిర్మాతలు మాట్లాడుతూ సాయిధరమ్ తేజ్ గారి చేతుల మీదుగా మా సినిమా టీజర్ రిలీజ్ అయినందుకు ఆనందం గా ఉంది. మేము అనుకున్నట్టే చాలా బాగా వచ్చింది. ఈ సినిమా హీరో గారి కెరీర్ లో మరొక మంచి సినిమా అవుతుందని మేమంతా గట్టిగా నమ్ముతున్నాం అని అన్నారు. ఇక ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకొని మార్చ్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాము. హీరో సాయి రామ్ శంకర్ , హీరోయిన్ యాశ శివ కుమార్ , సునీల్ , కాశి విశ్వనాథ్ , పోసాని కృష్ణ మురళి , పృథ్వి , తదితరులు నటిస్తున్నారు.

Vey Dharuvey Movie Teaser | Sai Raam Shankar,Yasha Shiva Kumar,Prudhvi Sunil | Devaraj Pothuru

Exit mobile version